Tuesday, November 15, 2016

బ్యాంకుల దగ్గర పడిగాపులు పడుతున్న ప్రజలు:-
నేను ఊహిస్తాను బోర్డు రూమ్ లో కూర్చుని ! అవే నిజం అవుతా ఉంటాయి ఎక్కువగా .
అయినా కొన్ని సార్లు ప్రత్యక్షం గా సర్వే కూడా చేస్తుంటా.
నోట్లు రద్దు అయిన తరువాత బ్యాంకు ల వద్ద నిలబడుతున్న వాళ్ళ విషయం లో మీడియా లో చూసి తెలిసిన వాళ్ళ ద్వారా విని , మిగతా అన్ని చూసిన తరువాత నేను కొన్ని అభిప్రాయాలకు వచ్చాను .
అవి నిజమా కాదా అని తెలుసుకునటానికి ఫిలిం నగర్ ఏరియా లో కొన్ని బ్యాంకు లు వద్దకు వెళ్ళా . ఇప్పుడు కూడా నా బోర్డు రూమ్ లో ఊహిచింది నిజం అయింది .
అదేమిటి అంటే ఏ బ్యాంకు లో కూడా లైన్ లో ఉన్న వాళ్ళో లో ఆ బ్యాంకు బ్రాంచ్ లో ఎకౌంటు ఉన్న వాళ్ళు ( హోం బ్రాంచ్ ) టెన్ % కూడా లేరు . మిగతా వాళ్ళలో ఆ ఏరియా కి సంబిందిచిన వాళ్ళు టెన్ % కూడా ఉండరు . అంటే మొత్తం నుంచున్న జనాలలో ఎనబై శాతం మంది బయటి ఏరియా వాళ్ళు అన్నమాట
వాళ్ళలో పొద్దున్నే ఉద్యోగం కోసం ఉండే చోటునుండి ఒక పది శాతం ఉన్నారు అనుకుంటే మిగతా డబ్బై శాతం వేరే ఏరియాస్ వాళ్ళు వాళ్ళకి ఎకౌంటు ఉన్న బ్రాంచ్ కాకుండా వేరే ఏరియాస్ కి ఎందుకు వచ్చారు అంటారు ?
హైదరాబాద్ మరియు మిగతా ముక్య పట్టణాల్లో గ్యాస్ అకౌంట్స్ నూటికి తొంబై శాతం మందికి లేవంటారా ? మరి ఉంటె వీళ్ళు అనడరికి బ్యాంకు అకౌంట్స్ అదార్ కి లింక్ అయినవి ఉంటాయిగా తప్పని సరిగా . మరి వాళ్ళ కి గ్యాస్ ఎకౌంటు లో డబ్బు పడే ఎకౌంటు ఉన్న బ్యాంకు వదిలి వేరే వాళ్ళు అకౌంట్స్ మైంటైన్ చేసే చోటుకు వచ్చి లైన్ లో నుంచుని హోం బ్రాంచ్ వాళ్ళని ఇబ్బంది పెట్టటం ఎంత వరకు సబబు ?
మీడియా దీని మీద రీసెర్చ్ చేయాకుండా పేద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని పేద బొబ్బలు పెట్టటం ఎబ్బట్టు గా ఉంది
ఈ డెబ్భై కి డెబ్భై శాతం లోయర్ మిడిల్ క్లాసు , లోయర్ క్లాస్స్ వాళ్ళు మాత్రమే . అంటే మహా అయితే అయిదు లేదా పది వేలు కాష్ రూపం లో ఉంటె ఎక్కువా . అంటే ఒక్క రోజు నిర్చుంటే సరిపోతుంది .కాని వాళ్ళలో ఎక్కువ మంది రోజు వస్తున్న వాళ్ళే అంట .
వీళ్ళ లో కొంత మంది పని చేసే యజమానులు కోసం వస్తూ ఉంటె , కొంత మంది స్కూష్మ-చిన్న-పెద్ద- బడా-బడాబడా నల్లదనం నిలువ ఉన్న వ్యక్తుల తరుపు లైన్స్ లో ఉన్న దిన సరి కూలీలు .
ఈ దిన సరి కూలీలు ఈ రోజు నాలుగు వొండలు కోసం చూస్తున్నారు గాని లాంగ్ టర్మ్ లో ఈ నల్ల బాకాసురాల వలన వాళ్ళకు-వాళ్ళ పిల్లల జీవితాలకు ఎంత నష్టం వస్తుందో ఊహించటం లేదు .
కోట్ల కన్నా ఎక్కువ ఉంటేనే నల్లదనం అనుకుంటారు . మన సమాజం లో లక్షలలో కూడా నల్ల దానం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు .
ఈ వారం చూసిన తరువాత మోడీ గవర్నమెంట్ సరి అయిన నిర్ణయం ద్వారా ఈ సమస్యను ఎదుర్కుంటుంది అనుకుంటున్నా .
అంత పెద్ద నిర్ణయం అంత గోప్యం గా అమలు చేసిన వ్యక్తి కి ఈ నల్ల బకాసురుల ముక్కులకు తాడులు వెయ్యటం అంత పెద్ద విషయం కాదేమో !